బిల్‌గేట్స్‌తో ముగిసిన చంద్రబాబు సమావేశం 1 y ago
బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై సుమారు 40 నిమిషాలపాటు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై కీలకంగా చర్చించామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాలపై చర్చించామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 దార్శినికత సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.